రమణాచారి కళాపోషకులు : ఇంద్రకరణ్ రెడ్డి
ABN, First Publish Date - 2023-02-02T00:37:18+05:30
ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా స్వరాష్ట్రంలో కూడా కళలు, కళాకారులను ప్రోత్సహించడంలో రమణాచారి ముందుంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
హరికథా మహోత్సవాలు ప్రారంభం
రవీంద్రభారతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా స్వరాష్ట్రంలో కూడా కళలు, కళాకారులను ప్రోత్సహించడంలో రమణాచారి ముందుంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కే.వీ.రమణాచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హరికథా మహోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు రమణాచారి సన్నిహితులని ఆధ్యాత్మిక, కళా రంగాల్లో సలహాలు తీసుకుంటారని తెలిపారు. దీంతో పాటు బ్రాహ్మణ పరిషత్ నిర్వహణలో రమణాచారి పాత్ర గొప్పదని అన్నారు. హరికథా కళాకారులు హరిదాసులకు నెల భృతి కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తెలిపారు. కళలు, కళాకారులకు పెద్దన్నగా రమణాచారి ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ రమణాచారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా వారం రోజులు కళా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించినవారవుతున్నారని అన్నారు. ఎంతో మంది కళాకారులను తయారుచేసిన ఘనత రమణాచారిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణాచారితో పాటు సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రవిశంకర్, మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు జరిగిన హరికథా ప్రేక్షకుల్ని రంజింపజేసింది. ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సత్కరించారు.
Updated Date - 2023-02-02T00:37:22+05:30 IST