ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంబీబీఎ్‌సతో సమానంగా పీజీ మెడికల్‌ సీట్లు

ABN, First Publish Date - 2023-07-15T04:59:27+05:30

దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎ్‌స(యూజీ) సీట్లకు సమానంగా పీజీ సీట్లను కూడా పెంచాలని కేంద్రం భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి .. కేంద్ర వర్గాల వెల్లడి

హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎ్‌స(యూజీ) సీట్లకు సమానంగా పీజీ సీట్లను కూడా పెంచాలని కేంద్రం భావిస్తోంది. రాబోయే మూడేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన దేశంలో స్పెషలిస్టు వైద్యల కొరత తీవ్రంగా ఉంది. ఆ కొరతను తీర్చాలంటే పీజీ సీట్ల సంఖ్యను పెంచాలి. అందుకోసం డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డు(డీఎన్‌బీ)కోర్సులను ప్రైవేటు ఆస్పత్రులతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టాల్సివుంటుందని తెలిపాయి. అలాగే ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 2014 నుంచి దేశంలో వైద్య కళాశాలలసంఖ్య పెరుగుతూ వస్తోంది. 9 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటులో కలపి 387 వైద్య కళాశాలలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 681కి పెరిగినట్ల్లు కేంద్రం వెల్లడించింది. 2014లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 51,348గా ఉంది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,04,333కు పెరిగింది. అలాగే పీజీ సీట్ల సంఖ్య 31,185 నుంచి 64,559కు పెరిగింది. ప్రస్తుతం యూజీకి, పీజీకి మధ్య సుమారు 40 వేల సీట్ల వ్యత్యాసం ఉంది.

Updated Date - 2023-07-15T04:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising