ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రికి బదులుగా ములుగు

ABN, First Publish Date - 2023-02-02T02:26:09+05:30

హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రణాళిక మరోసారి మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాత్‌ సే హాత్‌ జోడో ప్రారంభ వేదిక మార్పు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రణాళిక మరోసారి మారింది. ముందుగా నిర్ణయించినట్లుగా భద్రాచలంలో కాకుండా ములుగు నియోజకవర్గం సమ్మక్క, సారలమ్మ జాతర వద్ద నుంచి ప్రారంభం కానుంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఈ నెల 6న ఆ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరూ ఎక్కడెక్కడి నుంచి పాదయాత్రలు చేపట్టాలి వంటి అంశాలపై సమీక్ష కోసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌కు చేరుకోనున్న ఆయన.. శని, ఆదివారాల్లో పార్టీ నేతలు, విభాగాల బాధ్యులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ములుగు నియోజకవర్గంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ ప్రారంభ సభలో పాల్గొంటారు. పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దివంగత సీఎం వైఎ్‌సఆర్‌ నమ్మకాన్ని అనుసరిస్తున్నారు. పోస్టర్ల దగ్గరి నుంచి ఆహార్యాల వరకు వైఎ్‌సఆర్‌ను గుర్తు చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. పేరు కూడా యాత్ర.. ఫర్‌ చేంజ్‌ అని పెట్టారు. అప్పట్లో సబితా ఇంద్రారెడ్డిని తన సోదరిగా ప్రకటించుకున్న వైఎ్‌సఆర్‌.. ఆమె నియోజకవర్గం చేవెళ్ల నుంచే తన పాదయాత్రను ప్రారంభించారు. రేవంత్‌ కూడా అదే తరహాలో సీతక్క నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభిసున్నారు.

Updated Date - 2023-02-02T02:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising