ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్‌టీయూలో ముగిసిన మెగా జాబ్‌ మేళా

ABN, First Publish Date - 2023-02-27T00:55:19+05:30

కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో శని, ఆదివారాల్లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళా ముగిసింది. జాబ్‌ మేళాలో కోర్‌ ఇంజనీరింగ్‌, ఐటీ, ఫార్మా, నాన్‌ ఐటీ, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ తదితర 268 కంపెనీలు పాల్గొన్నాయి.

జేఎన్‌టీయూలో జాబ్‌ మేళాకు హాజరైన అభ్యర్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 10వేల మందికి ఆఫర్‌ లెటర్‌లు

  • ఇంటర్వ్యూలకు మరో 15వేల మంది ఎంపిక

జేఎన్‌టీయూ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో శని, ఆదివారాల్లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళా ముగిసింది. జాబ్‌ మేళాలో కోర్‌ ఇంజనీరింగ్‌, ఐటీ, ఫార్మా, నాన్‌ ఐటీ, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ తదితర 268 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో శనివారం 80వేల మంది, ఆదివారం 74వేల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని యూఐఐసీ డైరెక్టర్‌ తారాకల్యాణి, డిప్యూటీ డైరెక్టర్‌ జ్యోతుల సురేష్‌కుమార్‌ తెలిపారు. జాబ్‌ ఫెయిర్‌లో కంపెనీలు 10వేల మందికి అక్కడికక్కడే ఆఫర్‌ లెటర్‌లు ఇవ్వగా.. మరో 15వేల మందిని షార్ట్‌లిస్ట్‌ చేసి ఆయా కంపెనీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజర్‌ కావాలని కంపెనీల హెచ్‌ఆర్‌లు సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్‌ గోవర్ధన్‌, రిజిస్ర్టార్‌ మంజూర్‌ హుస్సేన్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-02-27T00:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising