జేఎన్‌టీయూహెచ్...బీటెక్, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2023-02-05T07:51:59+05:30
నవంబర్‌లో నిర్వహించిన బీటెక్ 3-1, 3-2 రెగ్యులర్ పరీక్షలు, అక్టోబర్‌లో నిర్వహించిన ఎంబీఏ సెమిస్టర్
హైదరాబాద్ సిటీ: నవంబర్‌లో నిర్వహించిన బీటెక్ 3-1, 3-2 రెగ్యులర్ పరీక్షలు, అక్టోబర్‌లో నిర్వహించిన ఎంబీఏ సెమిస్టర్ -1, 2 ఫలితాలను శనివారం రాత్రి జేఎన్‌టీయూహెచ్ విడుదల చేసింది. ఫలితాలు జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు ఫిబ్రవరి 11 వరకూ అవకాశం కల్పించారు. విద్యార్థులు ఫలితాలు results.jntuh.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.
Updated Date - 2023-02-05T07:52:18+05:30 IST