ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడి

ABN, First Publish Date - 2023-04-03T03:30:30+05:30

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహేతర సంబంధమే కారణం..!

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 2: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. సుల్తానాబాద్‌ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పోచాలు శనివారం రాత్రి ఓ వివాహిత ఇంట్లో ఉండగా, ఆమె బంధువులు అతడిని బయటకు లాగి కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో అతని తలకు, ముఖానికి, మర్మాంగంపై తీవ్రమైన గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొందరు యువకులు అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. పోచాలును కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ అతడి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దాడికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఎస్సై ఉపేందర్‌రావును ఈ సంఘటన గురించి వివరాలు అడుగగా.. దాడి వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Updated Date - 2023-04-03T03:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising