ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింగరేణి ఉద్యోగులకు పెరిగిన జీతాలు

ABN, First Publish Date - 2023-07-03T02:40:00+05:30

జాతీయ స్థాయిలో ఇటీవల కుదిరిన 11వ వేతన ఒప్పందం ప్రకారం నూతన వేతనాలను కార్మికులకు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూన్‌ నెలకు కొత్త జీతాలు నేడు చెల్లింపు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఇటీవల కుదిరిన 11వ వేతన ఒప్పందం ప్రకారం నూతన వేతనాలను కార్మికులకు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ నెలకు సింగరేణి ఉద్యోగులకు నూతన వేతనాల ప్రకారమే జీతాలను చెల్లించేందుకు కసరత్తు పూర్తి చేసింది. దీంతో 41వేల మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు ప్రయోజనం కలగనుంది. జూన్‌ నెల జీతాలను సోమవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. కోల్‌ ఇండియాకన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త వేజ్‌ బోర్డు జీతాలు అందిస్తుండటం విశేషం. కొత్త జీతాల అమలుతో ఏడాదికి సుమారు రూ.1,000 కోట్ల అదనపు భారాన్ని సింగరేణి భరించాల్సి ఉంటుంది. తక్షణమే కొత్త జీతాలను అమలు చేయాలని నిర్ణయించామని, సింగరేణి చైర్మన్‌, ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు జీతాల చెల్లింపునకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేశామని డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌) ఎన్‌ బలరాం తెలిపారు. కాగా రోజువారీ లెక్కన కేటగిరీ 1 బేసిక్‌ ఇంతకుముందు రోజుకు రూ.1,011.27 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.1,502.66 అయింది. మంత్లీ రేటెడ్‌ ఏ1 గ్రేడ్‌ ఉద్యోగి బేసిక్‌ ఇంతకుముందు నెలకు రూ.98,485.79 పొందేవారికి ఇప్పుడు నెలకు రూ.1,46,341.67 అయింది. మారిన కొత్త బేసిక్‌ ప్రకారం డైలీ రేటెడ్‌ కేటగిరీ1 ఉద్యోగి స్థూలంగా నెలకు రూ.59,386.57 జీతంగా పొందనున్నారు. మంత్లీ రేటెడ్‌ అండర్‌ గ్రౌండ్‌ ఏ1 గ్రేడ్‌లోని గరిష్ఠ బేసిక్‌ రూ.1,46,341.67 ఉన్న ఉద్యోగులు స్థూలంగా నెలకు రూ.2,16,618.74 జీతంగా అందుకోనున్నారు.

Updated Date - 2023-07-03T02:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising