వడ్ల తేమ శాతం పెంచండి!
ABN, First Publish Date - 2023-05-02T04:23:04+05:30
ధాన్యం సేకరణలో కీలక మార్గదర్శకాలను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ సోమ వారం లేఖ రాసింది.
కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణలో కీలక మార్గదర్శకాలను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ సోమ వారం లేఖ రాసింది. ప్రభుత్వం సేకరించే ధాన్యానికి 17 శాతం వరకు తేమ మినహాయింపు ఉండగా.. దాన్ని 20 శాతానికి పెంచాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. అందుకు అనుగుణంగా కమిషనర్ అనిల్ కుమార్ కేంద్రానికి లేఖ రాయటం గమనార్హం. సాధారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యంలో తేమ 17 శాతం వరకున్నా.. ఎమ్మెస్పీ చెల్లిస్తారు. అంతకంటే ఎక్కువ తేమ ఉంటే.. ఎమ్మెస్పీలో కోత పెడతారు. ఇలాకాకుండా 20 శాతానికి కటాఫ్ పెంచితే రైతులకు మేలు జరుగుతుందని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. ఇటు అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసిపోతోంది. రైస్‌మిల్లర్లు, ప్రైవేటు ట్రేడర్లు, దళారులు.. తడిసిన ధాన్యం కొనాలంటే ధర విపరీతంగా తగ్గిస్తున్నారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు అధికంగా ఉన్నాయని.. ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని, బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం తేల్చి చెప్పింది. తడిసిన ధాన్యాన్ని రా రైస్‌గా మార్చటం సాధ్యం కాదు. తప్పనిసరిగా బాయిల్డ్ మిల్లింగ్ చేయాల్సి వస్తుంది. అసలు కేంద్రమే నిబంధనలు సవరిస్తూ వడ్ల తేమ శాతాన్ని పెంచాలని లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.
Updated Date - 2023-05-02T04:23:04+05:30 IST