ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెంటు బిల్లు అప్‌డేట్‌ పేరుతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయం

ABN, First Publish Date - 2023-02-01T00:27:27+05:30

కరెంటు బిల్లు అప్‌డేట్‌ పేరు తో ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేసిన సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడ్‌మెట్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కరెంటు బిల్లు అప్‌డేట్‌ పేరు తో ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేసిన సంఘటన నేరేడ్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం చావలి దీప (50) గోకుల్‌నగర్‌ నివాసి. జనవరి నెల 30న ఇంటి కరెంటు బిల్లు చెల్లించలేదని ఆమె మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. వెంటనే చెల్లించకపోతే ఈ రోజు రాత్రి మీ ఇంటి కరెంటు కనెక్షన్‌ కట్‌ చేస్తామని, వివరాల కోసం కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నెంబర్‌ 7978619163ను సంప్రదించాలని ఆ మెసేజ్‌ సారాంశం. అయితే, ఆమె అంతకుముందే కరెంటు బిల్లును చెల్లించి ఉన్నందున మెసేజ్‌లోని ఫోన్‌ నెంబరుకు ఫోన్‌ చేసింది. టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌ వ్యక్తిగా పరిచయం చేసుకుని ‘మీ బిల్లు చెల్లింపు అప్‌డేట్‌ కాలేదని, వెంటనే ప్లే స్టోర్‌కు వెళ్లి లింకు డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.10 చెల్లిస్తే అప్‌డేట్‌ అవుతుందని’ నమ్మబలికాడు. దీంతో ఆమె తన ఫోన్‌లో ప్లే స్టోర్‌కు వెళ్లి అతను చెప్పిన లింకు డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.10 చెల్లింది. ఇలా చేసినా ఆమెకు కరెంటు బిల్లు అప్‌డేట్‌ కాలేదు. కానీ, ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.76,400 డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె మంగళవారం నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2023-02-01T00:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising