ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం

ABN, First Publish Date - 2023-03-29T01:21:06+05:30

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 22మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికిగాను కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రవీంద్రభారతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 22మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 సంవత్సరానికిగాను కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడు కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉస్మానియా వర్సిటీ వీసీ ఆచార్య డి.రవీందర్‌ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారగ్రహీతల్ని సత్కరించి అభినందించారు. విజేతలు ఒక్కొక్కరికి రూ.5,116 నగదు, జ్ఞాపికతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరముందని అన్నారు. సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్న వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ భట్టు రమేష్‌, రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.

పురస్కారగ్రహీతలు వీరే..

డా.సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు (ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి (ప్రాచీన సాహిత్యం), డా.వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి.ప్రసాద్‌(కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్‌ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి (బాలసాహిత్యం), డా.ఎ.వి.వీరభద్రాచారి (వచన కవిత), కొరుప్రోలు మాధవరావు (తెలుగు గజల్‌), జి.వి.కృష్ణమూర్తి (పద్య రచన), డా.మాదిరాజు బ్రహ్మానందరావు (పద్య రచన), డా.పసునూరి రవీందర్‌ (కథ), వేముల ప్రభాకర్‌ (నవల), ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు (హాస్య రచన), జి.భగీరథ (జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధర్‌ గౌడ్‌ (వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం (నాటక రచయిత), డా.వి.వి.వెంకట రమణ (జనరంజక విజ్ఞానం), ఎస్‌.వి.రామారావు(పరిశోధన), అన్నవరపు బ్రహ్మయ్య (పత్రికా రచన), రాళ్లపల్లి సుందర్‌ రావు (భాష), ఘట్టమరాజు అశ్వత్థనారాయణ (సాహిత్య రచన), కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి (అవధానం)లను సత్కరించారు.

Updated Date - 2023-03-29T01:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising