ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

35 వేల కోట్లు ఇవ్వండి

ABN, First Publish Date - 2023-01-24T04:07:41+05:30

వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడ్జెట్‌ కేటాయింపులకు నీటిపారుదల శాఖ ప్రతిపాదన

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణాల చెల్లింపులకు 2023-24లో రూ.12 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్ల దాకా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలు, రుణాల చెల్లింపుల కోసం రూ.35 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని ప్రతిపాదించారు. నీటిపారుదల శాఖలోని కీలకమైన ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగం రూ.499 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, సమర్పించింది. ఇందులో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.100 కోట్ల దాకా, పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.130 కోట్లు, ఇతరత్రా వాటికి, కొత్త పనులకు మిగిలిన రూ.269 కోట్లు అవుతాయని లెక్కలు వేశారు. వీటిలో నాగార్జునసాగర్‌ స్పిల్‌వే(ఓగీ) పనులతో పాటు పలు ప్రాజెక్టుల మరమ్మతుల ప్రతిపాదనలున్నాయి. అయితే రానున్న బడె ్జట్‌లో నీటిపారుదల శాఖకు రూ.25 వేల కోట్ల లోపే కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-01-24T04:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising