ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ హైస్కూల్‌లో 6,7,8,9 తరగతుల్లో ఉచిత విద్య

ABN, First Publish Date - 2023-06-04T02:37:13+05:30

ఆంధ్రప్రదేశ్‌లోని చల్లపల్లిలో ఉన్న ఎన్టీఆర్‌ హై స్కూల్‌లో నిరుపేద బాల, బాలికలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారా భువనేశ్వరి

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని చల్లపల్లిలో ఉన్న ఎన్టీఆర్‌ హై స్కూల్‌లో నిరుపేద బాల, బాలికలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 6,7,8,9 తరగతుల్లో ఒక్కో తరగతికి 10 మంది విద్యార్థుల్ని ఉచిత విద్యకు ఎంపిక చేయనున్నట్లు ఆమె చెప్పారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు చల్లపల్లి ఎన్టీఆర్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు జూన్‌ 9 వరకు గడువు ప్రకటించారు. అభ్యర్థుల సంఖ్య నిర్ణయించిన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటే జూన్‌ 11న ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా 2005 నుంచి ఎంపిక చేసిన నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు.

Updated Date - 2023-06-04T02:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising