ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Election PRC: ఎన్నికల పీఆర్సీ!

ABN, First Publish Date - 2023-06-21T04:27:55+05:30

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగుల్లో వ్యతిరేకత చల్లార్చేందుకు సర్కారు అడుగులు

పీఆర్సీకి విశ్రాంత ఐఏఎస్‌లను చూడండి

సాధారణ పరిపాలన శాఖకు సంకేతాలు

ఇప్పటికే అధికారుల వేట ప్రారంభించిన జీఏడీ

తొలుత ఐఆర్‌, ఎన్నికల ముందు ఫిట్‌మెంట్‌?

ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించిన సర్కారు

మిగిలిన రెండూ త్వరలోనే ప్రకటించే అవకాశం!

ఎన్నికల ముందు మచ్చిక చేసుకునేలా పావులు

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందా!? వారిలోని వ్యతిరేకతను తగ్గించేందుకు వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ను నియమించనుందా!? ముందుగా మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించి.. పీఆర్సీ నివేదిక ఇవ్వగానే ఎన్నికల ముందు ఫిట్‌మెంట్‌ను ప్రకటించనుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. పీఆర్సీ కోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. దాంతో, ఉద్యోగుల సర్వీసులు, వారి వేతనాలపై సంపూర్ణ అవగాహన కలిగిన రిటైర్డ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) వేట ప్రారంభించింది. ఇది కొలిక్కి రాగానే.. సీఎంకు ప్రతిపాదనలు పంపుతుంది. ఆయన ఆమోదంతో పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీని ప్రభుత్వం కోరే అవకాశమున్నట్లు తెలిసింది. నిజానికి, పీఆర్సీ పని నామమాత్రమే. అది సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను సీఎం ప్రకటించబోరు. తన స్వీయ నిర్ణయంతో ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ రావడం గత రెండు సందర్భాల్లో జరిగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 2013 పీఆర్సీకి సంబంధించిన ఫిట్‌మెంట్‌ను సీఎం భారీగా 43 శాతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, రాష్ట్రంలో మొదటి పీఆర్సీని 2018 మే 18న ఏర్పాటు చేశారు. అది కాస్తా 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేస్తే.. కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సీఎం కేసీఆర్‌ భారీగానే ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అప్పటిలోగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

వ్యతిరేకతను తగ్గించుకునేందుకే...!

ప్రభుత్వ తీరుపై కొంత కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ మూడు డీఏలను పెండింగ్‌లో పెట్టిందని, ఎట్టకేలకు సోమవారం ఒక డీఏను విడుదల చేసినా, ఇంకా రెండు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక శాతమో రెండు శాతమో వాటా చెల్లిస్తామని పదే పదే చెబుతున్నా ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎ్‌స) విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, సప్లిమెంటరీ బిల్లులను క్లియర్‌ చేయడం లేదని, మెడికల్‌ రీ-యింబర్స్‌మెంట్‌ బిల్లుల గురించి పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. పదోన్నతులు, బదిలీలను అటకెక్కించిందని, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని, కొత్త జిల్లాలకు కేడర్‌ స్ట్రెంథ్‌ను నిర్ధారించడం లేదని విమర్శిస్తున్నారు. అసంతృప్తులు, నిరసనల మధ్యనే ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్లు ఓడించారు. ప్రభుత్వంపై ఉన్న తమ వ్యతిరేకతను చాటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు దూరమవుతున్న అంశం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఎన్నికల ముందు వారిని మరింత దూరం చేసుకోవడం మంచిది కాదని భావిస్తోంది. ఎలాగైనా ఆ వర్గాలను మచ్చిక చేసుకుని, ఎన్నికల్లో గట్టెక్కాలని యోచిస్తోంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న వ్యతిరేకత, అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాల్లో పడింది. చాలా కాలంగా వారు అడుగుతున్న డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించడం ద్వారా దగ్గరవ్వాలని యోచిస్తోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు షాక్‌ ఇచ్చినందున అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగలకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇటీవల సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వారి వేతనాలు పెంచుతామని ప్రకటించారు. అన్నట్లుగానే... సోమవారం ఒక కరువు భత్యాన్ని (డీఏ) ప్రకటించారు. మిగతా రెండింటిని కూడా త్వరలోనే ప్రకటించవ్చని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అదే సమయంలో, పీఆర్సీ ప్రకటనపైనా ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వాస్తవానికి, రెండో పీఆర్సీ ఫిట్‌మెంట్‌ వచ్చే జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. అంటే.. ఆగస్టు వేతనంతో కలిపి ఇవ్వాలి. దీనికి కనీసం మూడు నెలల ముందుగానైనా పీఆర్సీని నియమించాలి. సదరు పీఆర్సీ ఉద్యోగ సంఘాలతో చర్చించి, మార్కెట్‌ పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కానీ, జూలై దగ్గర పడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటి వరకు పీఆర్సీని ఏర్పాటు చేయలేదు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. ఏ ఒక్క సమస్యను సకాలంలో పరిష్కరించడం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి పీఆర్సీ దిశగా అడుగులు వేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వెంటనే పీఆర్సీని నియమించాలి

రెండో పీఆర్సీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. కనీసం ఇప్పటికైనా పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా చూడాలి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆమోదయోగ్యమైన రీతిలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. ఎన్నికలు దగ్గరపడుతున్నందున... ప్రభుత్వం స్పందించి, పీఆర్సీని నియమిస్తుందని ఆశిస్తున్నాం. ఫిట్‌మెంట్‌ వచ్చే వరకు ఐఆర్‌ను ప్రకటించాలి. మిగతా రెండు డీఏలను కూడా ప్రకటించాలి. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎ్‌స) అమలు చేయాలి.

- రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.మోహన్‌ నారాయణ, ఎస్‌.నరసరాజు

ఫిట్‌మెంట్‌ వచ్చేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలి

ఉద్యోగులు, పింఛనుదారులకు ఫిట్‌మెంట్‌ అమల్లోకి రావాలంటే సమయం పడుతున్నందున జూలై 1 నుంచి మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటించి, అమలు చేయాలి. పీఆర్సీని కూడా వెంటనే నియమించి, సంతృప్తికరంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చారు. కానీ... అదే ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు మాత్రం ఇవ్వలేదు. ఈ దృష్ట్యా పెన్షనర్లకు కూడా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వాలి. పెన్షనర్లకు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను అందించాలి. ఇందుకు 1ు కాంట్రిబ్యూషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పెండింగ్‌లో ఉన్న మిగతా రెండు డీఏలను కూడా ప్రకటించాలి.

- తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ కె.లక్ష్మయ్య, టి.సుభాకర్‌రావు

Updated Date - 2023-06-21T04:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising