ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Election Code: తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్

ABN, First Publish Date - 2023-10-09T14:37:00+05:30

హైదరాబాద్: కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను సోమవారం మధ్యాహ్నం ప్ర‌క‌టించింది. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌ఢ్, మ‌ధ్య ప్ర‌దేశ్, మిజోరం, రాజ‌స్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌ుతుందని, డిసెంబ‌ర్ 3న కౌంటిగ్ జరిగి.. ఫలితాలు ప్ర‌క‌టిస్తారు.

హైదరాబాద్: కేంద్ర ఎన్నిక‌ల సంఘం (CEC) దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో (Five States) అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ (Assembly Election Schedule)ను సోమవారం మధ్యాహ్నం ప్ర‌క‌టించింది. తెలంగాణ‌ (Telangana), ఛ‌త్తీస్ గ‌ఢ్ (Chhattisgarh), మ‌ధ్య ప్ర‌దేశ్ (Madhya Pradesh), మిజోరం (Mizoram), రాజ‌స్థాన్ (Rajastan) రాష్ట్రాలు ఉన్నాయి. కాగా తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌ుతుందని, డిసెంబ‌ర్ 3న కౌంటిగ్ జరిగి ఫలితాలు ప్ర‌క‌టిస్తారని, ఈ రోజు నుంచే ఎన్నికల అమలులో ఉంటుందని సీఈసీ పేర్కొంది.

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ఆవిష్కరణలు ఆగిపోనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం, రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో అన్నీ నిలిచిపోయాయి.

కాగా సోమవారం ఉదయం కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని రైళ్లను ప్రారంభించారు. 1. హడప్సర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు.. 2. జైపూర్ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ పట్టణం వరకు.. 3. నాందేడ్ - తాండూర్ ఎక్స్‌ప్రెస్‌ను రాయచుర్ వరకు.. 4. కరీంనగర్ - నిజామాబాదు పాసెంజర్‌ను బోధన్ వరకు ప్రారంభించారు.

కాగా రాజస్థాన్‌కు నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. ఇక చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సహా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు జరిపామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం అదనంగా 1.01 లక్షల బూత్‌లకు వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక ప్ర‌భుత్వాల ప‌రంగా ఎలాంటి హామీలు, అధికారిక ప్ర‌క‌ట‌న‌లు, జీవోలు జారీ చేసేందుకు వీలు ఉండ‌ద‌న్నారు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-09T14:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising