ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా చౌర్యం కేసులో రంగంలోకి ఈడీ

ABN, First Publish Date - 2023-03-31T03:46:02+05:30

డేటా చౌర్యం కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టనుంది. సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) పొందుపరచి విచారణ చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనీ లాండరింగ్‌ కోణంలో విచారణ

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): డేటా చౌర్యం కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టనుంది. సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) పొందుపరచి విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, వ్యాపారులు, దేశభద్రత విభాగాల్లో విధులు నిర్వహిస్తోన్న వారితో పాటు సుమారు 16 కోట్ల మందికిపైగా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ముఠా వివిధ మార్గాల్లో ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి అవసరమైన వారికి విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొంత డేటా విదేశాలకు కూడా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు డేటా విక్రయించడం, అక్కడి నుంచి నగదు లావాదేవీలు జరిపిన నేపథ్యంలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ (పీఎంఎల్‌ఏ) కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది.

Updated Date - 2023-03-31T03:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising