ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ నేతలకు కాంట్రాక్టుల్లో కమీషన్లు

ABN, First Publish Date - 2023-02-07T03:26:22+05:30

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు దొడ్డిదారిన కాంట్రాక్టులు ఇస్తూ.. కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారని, ఎవరి వాటా ఎంతో గుట్టు విప్పుతానని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి

తన అభ్యర్థిగా ఆదినారాయణ పేరు ప్రకటన

అశ్వారావుపేట, పిబ్రవరి 6: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు దొడ్డిదారిన కాంట్రాక్టులు ఇస్తూ.. కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారని, ఎవరి వాటా ఎంతో గుట్టు విప్పుతానని అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో జారె ఆదినారాయణ అధ్యక్షతన అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ‘పొంగులేటి శీనన్న ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అధికార బీఆర్‌ఎస్‌ వైఖరిపై విరుచుకుపడ్డారు. ‘‘శ్రీనివాసరెడ్డికి రూ.కోట్లలో కాంట్రాక్టులు ఇచ్చామని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. వారు రాష్ట్రంలో ఎవరికెన్ని కాంట్రాక్టులు దొడ్డిదారిన ఇచ్చారో, తీసుకున్న కమీషన్లు, వాటాలేంటో గుట్టు విప్పుతా. ధైర్యముంటే దీనిపై పార్టీలోని అతిపెద్ద నాయకుడు చర్చకు రాగలరా?’’ అని పొంగులేటి సవాల్‌ చేశారు. బీఆర్‌ఎ్‌సలో ఓ స్థాయి కూడా లేని నాయకులు తనవెంట వచ్చిన వారిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తున్నారని, ఇందుకు వారికున్న అర్హతేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘నా వాళ్లను కాదు.. దమ్ముంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి’’ అని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని నమ్మబలికితే తెలంగాణను ఇచ్చిన కాంగ్రె్‌సను, సహకరించిన బీజేపీ, సీపీఐని కూడా కాదని.. ప్రజలు బీఆర్‌ఎ్‌సకు అధికారమిచ్చారని అన్నారు. .

ఇతర రాష్ట్రాల్లో ఆదర్శవంతమైన పథకాలు ప్రవేశపెడతామంటున్నవారు.. తెలంగాణలో ఏమి సాధించారని ప్రశ్నించారు. రెండేళ్లుగా ఒక్కో గ్రామపంచాయతీలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలో బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలకు తన తరఫున అభ్యర్థిగా జారె ఆదినారాయణ పేరును పొంగులేటి ప్రకటించారు. వైరా నియోజకవర్గం నుంచి బాణోతు విజయాబాయిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-07T03:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising