ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీలపై చలి పంజా

ABN, First Publish Date - 2023-02-07T03:24:00+05:30

కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఏజెన్సీ గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(యు)లో 7.5డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ఆసిఫాబాద్‌/ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఏజెన్సీ గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడంతో ఏజెన్సీ గ్రామాలు చలితో వణికిపోతున్నాయి. సోమవారం తెల్లవారు జామున రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు)లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత జైనూరులో 8.6, వాంకిడిలో 8.7, తిర్యాణిలో 9.1, కెరమెరిలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. అలాగే ఆదిలాబాద్‌ జిల్లాలో బజార్‌హత్నూర్‌లో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత బేలలో 8.9, జైనథ్‌లో 9.5, బోథ్‌ సోనాలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీల్లో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పశువులపై గోనే సంచులు కప్పి ఉంచుతూ, చలి మంటలు వేస్తూ వెచ్చదనాన్ని కల్పిస్తున్నారు.

Updated Date - 2023-02-07T03:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising