ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ ఓ 420!

ABN, First Publish Date - 2023-04-23T04:39:51+05:30

రాష్ట్రంలోని రైతులను మోసగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ 420 అంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పది రోజుల్లో పంట నష్ట పరిహారం ఇస్తానని చెప్పిన సీఎం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంటనష్టానికి రూపాయీ ఇవ్వలేదు

రైతులకు క్షమాపణ చెప్పాలి: షర్మిల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులను మోసగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ 420 అంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పది రోజుల్లో పంట నష్ట పరిహారం ఇస్తానని చెప్పిన సీఎం..ఇప్పటి వరకూ రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ మేరకు తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘మొత్తం 2.28 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల ఎకరాల్లో మాత్రమే నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం తేల్చింది. అన్నదాతలను ఆదుకునే సోయి లేని కేసీఆర్‌.. పక్కరాష్ట్రాల్లో మాత్రం తనది రైతుల సర్కారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రైతులకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పి.. వరికి ఎకరాకు రూ. 25 వేలు, మొక్కజొన్నకు రూ. 50 వేలు, మామిడికి రూ.75 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి’’అని షర్మిల డిమాండ్‌ చేశారు. కాగా.. ఈ నెల 26న ధర్నా చౌక్‌లో టీ-సేవ్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరుద్యోగ దీక్షలో షర్మిల పాల్గొననున్నారని ఆ పార్టీ నేత పిట్ట రాంరెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-04-23T04:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising