ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కులవృత్తిని సీఎం కేసీఆర్‌ నాశనం చేశారు

ABN, First Publish Date - 2023-06-06T04:22:35+05:30

రాష్ట్రంలో గంగపుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ తమ కులవృత్తిని సర్వనాశనం చేశారని తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్ర, నగర గంగపుత్ర సంఘాలు ఆరోపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8న రాష్ట్రవ్యాప్త నిరసన: గంగపుత్ర సంఘాలు

పంజాగుట్ట, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంగపుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ తమ కులవృత్తిని సర్వనాశనం చేశారని తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్ర, నగర గంగపుత్ర సంఘాలు ఆరోపించాయి. ఈ నెల 8న జరిగే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని వెల్లడించాయి. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గడప శ్రీహరి, ప్రధాన కార్యదర్శి శరణార్థి చంద్రప్రకాశ్‌, నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు చాట్ల సదానంద్‌, ప్రధాన కార్యదర్శి పిల్లి శంకర్‌ మాట్లాడారు. గంగపుత్రులకు వ్యతిరేకంగా 2016లో తెచ్చిన జీవో 6 నుంచి ఈ ఏడాది మే 16న జారీ చేసిన జీవో 45 వరకు అన్ని జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-06T04:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising