ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం ‘మున్నేరు’పై కేబుల్‌ బ్రిడ్జి

ABN, First Publish Date - 2023-01-20T03:06:36+05:30

ఖమ్మం వద్ద మున్నేరుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌లోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి తరహాలోనే ఈ బ్రిడ్జి కూడా ఉండనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.180 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అజయ్‌

హైదరాబాద్‌, ఖమ్మం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : ఖమ్మం వద్ద మున్నేరుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌లోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి తరహాలోనే ఈ బ్రిడ్జి కూడా ఉండనుంది. మొత్తం 420 మీటర్ల పొడవైన బ్రిడ్జిలో 300 మీటర్ల తీగల వంతెన ఉండనుంది. ఈ నూతన వంతెన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.180 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు గురువారం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసిన మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలియజేశారు. హామీ ఇచ్చిన 24గంటల్లోనే సీఎం తన మాట నిలబెట్టుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అలాగే ఖమ్మం ఎంపీ, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరారవు కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-01-20T03:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising