ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజన పూజారులు, పాస్టర ్లకూ గౌరవ భృతి ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-06-02T02:29:57+05:30

రాష్ట్రంలోని అర్చకులకు గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్చకులకు గౌరవభృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం స్పందించారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యం అన్ని మతాలు, కులాలను సమానంగా చూడాలన్నారు. అర్చకులలాగే అన్ని బహుజన దేవాలయాల పూజారులు, మసీదుల్లో మౌజం, ఇమాంలు, చర్చి పాస్టర్లకు కూడా గౌరవ భృతిని రెగ్యులర్‌గా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా ‘మన’ పత్రికలను ఆదరించాలంటూ ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌లో ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. కుటుంబ పాలన, ఆస్తులపై కవితకు ఉన్నంత స్పష్టత లేనందు వల్లనే ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారిక ప్రకటనలను సొంత పత్రికలకు ఇచ్చుకుంటూ ప్రజాధనాన్ని దోచుకొనుడెందుకని ఆయన నిలదీశారు.

Updated Date - 2023-06-02T02:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising