మిలియన్ డాలర్ డెమో విజేతగా ‘ఆటోక్రసీ’
ABN, First Publish Date - 2023-04-05T00:47:46+05:30
భారత ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ డెమోలో హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త నేతృత్వంలోని స్టార్టప్ మొదటి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ డెమోలో హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త నేతృత్వంలోని స్టార్టప్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్టార్టప్ రూపకర్త, ఆటోక్రసీ మెషీనరీ సహ వ్యవస్థాపకురాలు బుద్ధిరాజు సంతోషి సుష్మా మంగళవారం వెల్లడించారు. ఈ చాలెంజ్‌లో దేశవ్యాప్తంగా 200 స్టార్ట్‌పలు పాల్గొన్నాయి. కందకాలు తవ్వడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం కోసం ఈ సంస్థ స్టార్ట్‌పను అభివృద్ధి చేసింది. గ్యాస్, నీటి పైపులైన్లు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్స్, వ్యవసాయం తదితర రంగాల్లో అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఆటోక్రసీ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌తో కలిసి ఈ స్టార్ట్‌పను ప్రారంభించింది. సంతోషి, లక్ష్మణ్‌లకు ప్రారంభంలో వీహబ్ రూ.20లక్షలు ఆర్థిక సాయం అందించింది.
Updated Date - 2023-04-05T00:47:46+05:30 IST