ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon Air services: ‘అమెజాన్‌ ఎయిర్‌’ సేవలు షురూ

ABN, First Publish Date - 2023-01-24T03:56:31+05:30

వినియోగదారులకు వస్తువులను మరింత వేగంగా సరఫరా చేయడం కోసం ప్రముఖ ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌. అమెజాన్‌ ఇండియా.. ‘అమెజాన్‌ ఎయిర్‌’ సేవలను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేటీఆర్‌

వేగంగా సరఫరా.. అమెరికా, యూరప్‌ తర్వాత ఇక్కడే

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వినియోగదారులకు వస్తువులను మరింత వేగంగా సరఫరా చేయడం కోసం ప్రముఖ ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌. అమెజాన్‌ ఇండియా.. ‘అమెజాన్‌ ఎయిర్‌’ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం ద్వారా వస్తువులను రవాణా చేయడానికి (డెడికేటెడ్‌ ఎయిర్‌కార్గో నెట్‌వర్క్‌).. క్విక్‌జెట్‌ కార్గో ఎయిర్‌లైన్స్‌తో థర్డ్‌పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌లో.. ఈ ‘అమెజాన్‌ ఎయిర్‌’ సేవలను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇప్పటిదాకా ఉత్తర అమెరికాలో, యూరప్‌ దేశాల్లో మాత్రమే ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటి తర్వాత ఇక్కడే ఎయిర్‌కార్గో సేవలు అందుబాటులోకి తేనుంది. దేశంలో ఎయిర్‌ కార్గో కోసం ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్న తొలి ఈ కామర్స్‌ కంపెనీ అమెజానే. ఇందులో భాగంగా.. క్విక్‌జెట్‌ కార్గోకు చెందిన రెండు బోయింగ్‌ 737-800 రకం విమానాలను వస్తువుల రవాణాకు వినియోగించనుంది.

హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల మధ్య ఈ అమెజాన్‌ ఎయిర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇతర నగరాలకు విస్తరిస్తారు. అమెజాన్‌ ఎయిర్‌ను 2016లో అమెరికాలో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70 గమ్యస్థానాల్లో 110 విమానాలతో వస్తువులను రవాణా చేస్తున్నారు. బోయింగ్‌ 737-800 విమానం ద్వారా ఒక ఫ్లైట్‌లో 20,000 షిప్‌మెంట్లను రవాణా చేయొచ్చని అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు. ఎయిర్‌షి్‌పమెంట్‌కు ఇప్పటి వరకూ వాణిజ్య విమానయాన సంస్థలపై ఆధారపడుతున్నామని.. అమెజాన్‌ ఎయిర్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాన నగరాల మధ్య వస్తు రవాణాలో వెసులుబాటు లభిస్తుందని, ఒక్క రోజులోనే వస్తువులను కస్టమర్లకు అందించగలుగుతామని సక్సేనా వివరించారు. దేశంలోని 97 శాతం పిన్‌కోడ్‌ ప్రాంతాల్లో రెండో రోజే వస్తువులను తాము డెలివరీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

50 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు..

అమెజాన్‌కు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 50 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4.3 కోట్ల ఘనపు అడుగుల స్పేస్‌ ఉంది. తెలంగాణలో మొత్తం 4 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో 33 లక్షల ఘనపుటడుగుల స్థలం ఉంది. అమెజాన్‌ ద్వారా 11 లక్షల మంది వ్యాపారులు తమ వస్తువులను విక్రయిస్తున్నారు. వ్యాపారులకు, కొనుగోలుదారులకు అమెజాన్‌ ఎయిర్‌ మరింత వెసులుబాటును కల్పిస్తుందని సంస్థ గ్లోబల్‌ ఎయిర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సారా రోడ్స్‌ అన్నారు.

అమెజాన్‌ పెట్టుబడులు కొనసాగించాలి: కేటీఆర్‌

మల్టీ-మోడల్‌ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి తెలంగాణ సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని.. ఈ-కామర్స్‌ పంపిణీ వ్యవస్థ, సరఫరా వ్యవస్థకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమెజాన్‌ ఎయిర్‌ సేవలను ప్రారంభించిన మంత్రి.. దేశానికి హైదరాబాద్‌ కార్గో హబ్‌గా మారడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అమెజాన్‌ ఇక్కడ పెట్టుబడులు పెడుతూనే ఉందని, దీన్ని కొనసాగించాలని కోరారు. ‘‘అమెజాన్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది. సియాటెల్‌లో లేదు. అసియాలోనే అతిపెద్ద స్థాయిలో అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయి’’ అని మంత్రి గుర్తుచేశారు. ఎఫ్‌టీ ఎఫ్‌డీఏ ర్యాంకింగ్‌ ప్రకారం ప్రపంచంలోనే హైదరాబాద్‌ అతి తక్కువ వ్యయం అయ్యే ఏరోస్పేస్‌ సిటీ అని.. 2020-21లో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో రవాణా (పరిమాణపరంగా) 35ు పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో అమెజాన్‌ కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. అమెజాన్‌ ఇప్పటికే రాష్ట్రంలోని 56 గ్రామాలకు చెందిన 4500 మంది చేనేత కార్మికులకు అమెజాన్‌ అండగా ఉందని.. మరింతమంది చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలవాలని కోరారు.

Updated Date - 2023-01-24T03:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising