ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధం:హరగోపాల్‌

ABN, First Publish Date - 2023-01-26T03:14:22+05:30

దండకారణ్యంలోని ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలోని ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వ వైమానిక దాడులు రాజ్యాంగ విరుద్ధమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు. ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలంటూ ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుద్ధిజీవులు-ప్రజాస్వామికవాదుల ఆధ్వర్యంలో బుధవారం ‘దండకారణ్య ఆదివాసులపై వైమానికదాడులు రాజ్యాంగ వ్యతిరేకం’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరగోపాల్‌ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిపై జనవరి 11న దక్షిణ ఐస్తర్‌లోని కిష్టారం, పామేడు ప్రాంతంలో జరిగిన సైనికదాడి తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. హెలికాప్టర్‌లో కోబ్రా దళాలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబుల దాడి చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ దాడిలో పొట్టం అంగి అనే ఆదివాసీ యువతి మృతిచెందినట్టు చెప్పారు. జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వమే దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయడం బాధాకరమన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. దండకారణ్య ప్రాంతంలో సైనిక దాడులు జరపడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Updated Date - 2023-01-26T03:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising