ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahesh Bhagwat: డ్రగ్స్‌ రవాణాపై ఉక్కుపాదం

ABN, First Publish Date - 2023-01-28T12:11:11+05:30

డ్రగ్స్‌ రవాణా, వినియోగంపెస్త్ర ఉక్కుపాదం మోపాలని పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: డ్రగ్స్‌ రవాణా, వినియోగంపెస్త్ర ఉక్కుపాదం మోపాలని పోలీసులకు డీజీపీ అంజనీ కుమార్‌ పిలుపునిచ్చారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ (ఎన్‌డీపీఎ్‌స) చట్టం, దర్యాప్తు ప్రక్రియ అవగాహన కోసం సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులకు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరంగా మారిందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, గొలుసుకట్టు విధానంలో జరిగే మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని సూచించారు. ‘‘నార్కోటిక్స్‌ డ్రగ్స్‌, సైకోట్రోఫిక్స్‌ చట్టాన్ని అమలు చేయడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. గత ఏడాది రాష్ట్రంలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న 1278 మందిపై కేసులు నమోదు చేశాం. 218 మందిపై పీడీ చట్టం అమలు చేశాం. 2021లో 152 మందిపై, 2020లో 46 మందిపైన కలిపి గడచిన మూడేళ్లలో మొత్తం 416 మందిపై పీడీ చట్టం ప్రయోగించాం. ఇదే కాలంలో డ్రగ్స్‌ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 7498 మంది ని అరెస్ట్‌ చేశాం అని డీజీపీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో డ్రగ్స్‌ మూలాలు లేవని సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌డీపీఎ్‌స కేసుల్లో సరైన దర్యాప్తు ప్రాముఖ్యతను అధికారులకు వివరించారు.

Updated Date - 2023-01-28T12:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising