ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓయూకు వెయ్యి కోట్ల బడ్జెట్‌ కేటాయించాలి

ABN, First Publish Date - 2023-02-07T00:38:20+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడంతో పాటు, అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఓయూ తెలుగు విభాగాధిపతి ప్రొ. కాశీం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తార్నాక, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడంతో పాటు, అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఓయూ తెలుగు విభాగాధిపతి ప్రొ. కాశీం అన్నారు. వర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రొ. కాశీం సోమవారం ఆర్ట్స్‌ కాలేజీ ముందు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వినూత్నంగా నిరసన దీక్ష చేపట్టారు. పలు విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే ఓయూతో పాటు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను భర్తీ చేయాలని కోరారు. దీక్షకు ఓయూ టీచర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ప్రొ. మల్లేశం, ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొ. గణేష్‌, ప్రొ. సూర్య ధనుంజయ్‌, ప్రొ. నిర్మలాదేవి, ప్రొ. చెన్నప్ప, ప్రొ. మంగూనాయక్‌, డా. చలమల్ల వెంకటేశ్వర్లు, డా. కొర్రెముల శ్రీనివా్‌స సంఘీభావం ప్రకటించారు.

Updated Date - 2023-02-07T00:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising