9 నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్
ABN, First Publish Date - 2023-04-03T01:47:57+05:30
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరలో కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
8న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరలో కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. 9 నుంచి సాధారణ ప్రయాణికులకు రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20701).. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20702) రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మంగళవారం మెయింటెనెన్స్ కోసం విరామం ప్రకటించారు.
Updated Date - 2023-04-03T01:47:57+05:30 IST