బీసీలకు 50 శాతం టికెట్లు
ABN, First Publish Date - 2023-01-18T00:27:07+05:30
‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు బీసీలకు 50 శాతం టికెట్లు బర్కత్‌పుర, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు కే టాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలను విస్మరించే పార్టీకి ఎన్నికల సమయంలో గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో చలో ఢిల్లీతోపాటు పార్లమెంట్ ముట్టడిని నిర్వహిస్తామన్నారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో చలో ‘ఢిల్లీ వాల్‌పోస్టర్’ను కృష్ణయ్య ఆవిష్కరించారు. పార్గమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని, క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, పారిశ్రామిక పాలసీలో 50 శాతం వాటాను బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీలతోపాటు కర్ణాటక, ఒరిస్సా నుంచి వేలాది మంది బీసీలు తరలి రానున్నారని ఆయన అంచనావేశారు. బీసీ సంఘాల నాయకులు రాజ్‌కుమార్, చంద్ర, నందగోపాల్, పి.సుధాకర్, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
బర్కత్‌పుర, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు కే టాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలను విస్మరించే పార్టీకి ఎన్నికల సమయంలో గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో చలో ఢిల్లీతోపాటు పార్లమెంట్ ముట్టడిని నిర్వహిస్తామన్నారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో చలో ‘ఢిల్లీ వాల్‌పోస్టర్’ను కృష్ణయ్య ఆవిష్కరించారు. పార్గమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని, క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, పారిశ్రామిక పాలసీలో 50 శాతం వాటాను బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేపట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీలతోపాటు కర్ణాటక, ఒరిస్సా నుంచి వేలాది మంది బీసీలు తరలి రానున్నారని ఆయన అంచనావేశారు. బీసీ సంఘాల నాయకులు రాజ్‌కుమార్, చంద్ర, నందగోపాల్, పి.సుధాకర్, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:27:11+05:30 IST