ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: ఆ ఐపీఎస్‌లలో 40మంది గ్రేటర్‌లోనే..

ABN, First Publish Date - 2023-01-27T07:48:07+05:30

రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగడంతో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగడంతో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో కొత్త అధికారులు ఆసీనులు కానున్నారు. జనవరి నెలలోనే రెండుసార్లు మొత్తం కలిపి 120 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఈనెల 3న 29మంది సీనియర్‌ ఐపీఎ్‌సలను బదిలీ చేసిన ప్రభుత్వం, బుధవారం రాత్రి ఏకంగా 91 మందిని మార్చింది. ఆయా అధికారుల్లో సింహభాగం అంటే మొత్తం 40 మంది అధికారులు మూడు కమిషనరేట్లలోనే బదిలీ కావడం గమనార్హం. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఐపీఎ్‌సల బదిలీలు జరగడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ట్రై కమిషనరేట్‌లలో ఉన్న పోస్టులతోపాటు కొత్త జోన్‌లు ఏర్పాటు చేసి.. ఆయా స్థానాలకు కూడా కొత్త అధికారులను బదిలీ చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో 12, సైబరాబాద్‌లో 13, రాచకొండలో 15 మంది అధికారులు బదిలీ అయ్యారు.

సీసీఎస్‌ డీడీ జాయింట్‌ సీపీగా ఉన్న గజరావు భూపాల్‌ ఈ నెల మూడున రాచకొండ జాయింట్‌ సీపీగా బదిలీ అయినప్పటికీ, తిరిగి పాత స్థానంలోకి వచ్చేశారు. నగరంలో అపార అనుభవం ఉన్న సౌత్‌జోన్‌ డీసీపీగా గుర్తింపు తెచ్చుకున్న వి.సత్యనారాయణ రాచకొండ జాయింట్‌ సీపీగా వచ్చారు. కొన్నేళ్లుగా సౌత్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీగా వ్యవహరిస్తున్న సాయిచైతన్యకు అదే స్థానం అప్పగించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సౌత్‌వెస్ట్, సౌత్‌ఈస్ట్ జోన్‌లతో పాటు ఖాళీగా ఉన్న పలు కార్యాలయాల్లో కొత్త అధికారులు రానున్నారు. తాజా బదిలీల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో బాధ్యతలు చేపట్టే అధికారులు వీరే

Updated Date - 2023-01-27T07:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising