ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీ జాబితాలో 11 కులాలు!

ABN, First Publish Date - 2023-02-11T04:13:37+05:30

రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) జాబితాలో మరో 11 కులాలు చేరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం సీఎం కేసీఆర్‌ శాసనసభలో రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకి బోయ, ఖాయితీ లంబాడ.. మరో 9 కులాలు

రెండు తీర్మానాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌

ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ

తీర్మానాలను కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) జాబితాలో మరో 11 కులాలు చేరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం సీఎం కేసీఆర్‌ శాసనసభలో రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ‘‘వాల్మీకి బోయ, బేదర్‌, కిరాతక, నిషాధి, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయితీ లంబాడ, భాట్‌ మధురలు, చమర్‌ మధురలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ 2016లో షెడ్యూల్డు తెగల విచారణ సంఘం సిఫారసు చేసింది. ఆ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు’’ అని సీఎం వివరించారు. ఈ దృష్ట్యా 10 కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లా ల్లో నివసిస్తున్న ‘మాలి’ సామాజిక వర్గం గత కొన్నేళ్లుగా తమను ఎస్టీలుగా పరిగణించాలని కోరుతోందని సీఎం తెలిపారు. వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, మాలి కులాన్ని కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సభ ఈ తీర్మానాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రెండు తీర్మానాలను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు.

Updated Date - 2023-02-11T04:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising