రాజకీయాల్లోకి చెన్నమనేని విద్యాసాగర్‌రావు వారసుడు
ABN, First Publish Date - 2023-08-27T03:52:45+05:30
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుల వారసులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు బీఆర్‌ఎస్...
30న కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక
వేములవాడ నుంచి పోటీ చేసే అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుల వారసులు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు బీఆర్‌ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయులిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికా్‌సరావు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వికా్‌సరావును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని విద్యాసాగర్‌రావు యోచిస్తున్నట్లు సమాచారం. వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమే్‌షబాబు.. విద్యాసాగర్‌రావుకు స్వయానా అన్న అయిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు కొడుకు. పౌరసత్వ వివాదం కారణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబుకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-08-27T03:52:45+05:30 IST