ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుండాల మండలాన్ని దత్తత తీసుకుంటా

ABN, First Publish Date - 2023-06-16T00:50:15+05:30

గుండాల మండలాన్ని దత్తత తీసుకుని మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గుండాల మండలకేంద్రంలో గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపు రేఖ లు మారాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

గుండాల, జూన్‌15: గుండాల మండలాన్ని దత్తత తీసుకుని మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గుండాల మండలకేంద్రంలో గురువారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపు రేఖ లు మారాయన్నారు. కాంగ్రెస్‌ పాలించే రాష్ర్టాల్లో 5గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్నారని, సరిహద్దులోని ఛత్తీ్‌సఘడ్‌లో రైతులు తెలంగాణలో ఉచిత కరెంట్‌కోసం గుంట, రెండు గుంటల భూమి కొనుగోలు చేసి బోర్లువేసి పైపులైన్‌ వేసుకుని ఉచిత కరెంట్‌ను అనుభవిస్తున్నారన్నారు. నీళ్లు లేక బీడుగా మారిన గుండాల మండలం ప్రస్తు తం నవాబ్‌పేట రిజర్వాయర్‌ వల్ల సస్యశ్యామలమైందన్నారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ సంకల్పం మేరకు గ్రామా ల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గుండాల మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించగా హర్షంతో పాదాభివందనం చేయబోతుండగా మంత్రి ఎర్రబెల్లి అడ్డుకుని ఆశీర్వాదం తెలిపారు. అనంతరం మండలంలోని సుద్దాల-పల్లెపహాడ్‌ గ్రామాల మధ్య బిక్కేరు వాగుపై రూ.14.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రితోపాటు ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలాసత్పథి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, డీపీవో సునంద, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఖలీల్‌, ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీటీసీ లక్ష్మి, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-16T00:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising