ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GROUP-2 : గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు 2, 3 తేదీల్లో

ABN, First Publish Date - 2023-08-14T03:15:27+05:30

గ్రూప్‌-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. కానీ, గురుకుల, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, ఐబీపీఎస్‌ వంటి పలు పోటీ పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉండడంతో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. పరీక్ష తేదీలను మార్చాలన్న డిమాండ్‌తో వేలాది మంది టీఎ్‌సపీఎస్సీని ముట్టడించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన నివాసంలో సత్యాగ్రహ దీక్షను, టీజేఎస్‌ అధినేత కోదండరాం తన ఇంట్లో మౌనదీక్షను చేపట్టారు. ఇలా గ్రూప్‌-2ను వాయిదా వేయాలని ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌.. పరీక్ష తేదీలను మార్చేందుకు టీఎ్‌సపీఎస్సీని సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి పోటీ పరీక్షలన్నింటికీ సిద్ధమయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన ఆదేశాలతో సీఎస్‌ శాంతికుమారి టీఎ్‌సపీఎస్సీ అధికారులతో చర్చించి, గ్రూప్‌-2 పరీక్ష తేదీలను మార్చారు.

Updated Date - 2023-08-14T03:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising