ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్వుగట్టుపై ఘనంగా అగ్నిగుండాల మహోత్సవం

ABN, First Publish Date - 2023-02-01T01:07:44+05:30

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఓం నమఃశివా య అంటూ భక్తిపారవశ్యంతో కణకణ మండే నిప్పుకణికలపై శివసత్తులు, భక్తులు, అధికారులు ఉత్సాహంగా నడిచి తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. తొలుత పర్వతవాహన సేవతో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రధానాలయ మహామండపం నుంచి సన్నాయి వాయిద్యాల మధ్య అగ్నిగుండాల మహోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, జనవరి 31: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఓం నమఃశివా య అంటూ భక్తిపారవశ్యంతో కణకణ మండే నిప్పుకణికలపై శివసత్తులు, భక్తులు, అధికారులు ఉత్సాహంగా నడిచి తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. తొలుత పర్వతవాహన సేవతో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రధానాలయ మహామండపం నుంచి సన్నాయి వాయిద్యాల మధ్య అగ్నిగుండాల మహోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ ప్రాం త సంప్రదాయ పంటల ధాన్యాలతో అగ్నిమథనం చేసిన దేవస్థాన ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ అగ్నిగుండాన్ని వెలిగించారు. అనాదిగా వస్తున్న ఆచారం మేరకు తొలుత వీరముష్టి వంశీకులు ప్రభను పట్టగా హరహర మహదేవ శంభోశంకర అంటూ శివసత్తులు పూనకాలూగగా అగ్నిగుండాల మహోత్సవం తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రా రంభమైంది. సుమారు రెండు గంటల పాటు క్యూలైన్లలో వచ్చిన భక్తులు అగ్నిగుండంపై నడిచేందుకు పోటీపడ్డారు. అగ్నిగుండం ద్వారా వచ్చిన భ స్మాన్ని భక్తులు మహిమాన్వితంగా భావించి విబూది తిలకంగా నుదుటన అలంకరించుకున్నారు. మరికొందరు భస్మాన్ని తమ పంట పొలాల్లో చల్లేందుకు తీసుకెళ్లారు. కాగా ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా నల్లగొండ డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, నల్లగొండ డీఎస్పీ నర్సింహ్మారెడ్డి, దేవాదాయశాఖ ఏసీ కే.మహేంద్రకుమార్‌, తహసీల్దార్‌ మురళీమోహన్‌, ఎంపీడీవో యాదగిరి, ఈవో నవీన్‌కుమార్‌, నార్కట్‌పల్లి సీఐ, ఎస్‌ఐలు శివరాంరెడ్డి, బీ.రామకృష్ణ పాల్గొన్నారు. కాగా, వాహన సేవలో పోలీసులతో శివసత్తులు వాగ్వాదానికి దిగగా కొద్దిసేపు తోపులాట జరిగింది.

Updated Date - 2023-02-01T01:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising