ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీహయగ్రీవ సరస్వతీ మహాయాగం

ABN, First Publish Date - 2023-01-27T01:29:34+05:30

వసంత పంచమిని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ సేవా సమితి వ్యవస్థాపకురాలు, రమణచక్రవర్తుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో హయగ్రీవ సమేత సరస్వతీ మహాయాగాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా వేదికను అలంకరించి అమ్మవారిని అధిష్ఠింపజేసి పంచామృతాలు, నవరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వసంత పంచమిని పురస్కరించుకుని అక్షరాభ్యాసం

నల్లగొండ కల్చరల్‌, జనవరి 26 : వసంత పంచమిని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ సేవా సమితి వ్యవస్థాపకురాలు, రమణచక్రవర్తుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో హయగ్రీవ సమేత సరస్వతీ మహాయాగాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా వేదికను అలంకరించి అమ్మవారిని అధిష్ఠింపజేసి పంచామృతాలు, నవరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సతీమణి రమాదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వెంకటరమణాచార్యులు, శారద, పావని, సరస్వతి, సరిత, శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం

మిర్యాలగూడ రూరల్‌: మండలంలోని అవంతీపురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరుడి శాంతి కల్యాణ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 400మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్‌ చైర్మన్‌ తిప్పన విజయసింహారెడ్డిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణమాచార్యులు, చక్రవర్తి, రామాచారి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ నరసింహులు, ఆలయ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ శరత్‌బాబు, ఎంపీపీ సరళ, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెలిశెట్టి రామకృష్ణ, సర్పంచ్‌ వెంకన్న, బొప్పన రామకోటేశ్వర్‌రావు, డాక్టర్‌ ప్రశాంత్‌, వంశీబాబు, రాంప్రసాద్‌, పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising