అమ్మాయిలు అదుర్స్
ABN, First Publish Date - 2023-05-10T00:41:59+05:30
ఇంటర్ ఫలితా ల్లో అమ్మాయిల హవా కొనసాగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను వెల్లడించగా, జిల్లా మొదటి సంవత్సరం పరీక్షల్లో 55 శాతం, ద్వితీ య సంవత్సరంలో 63శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా8 జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 55శాతం
ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
యాదాద్రి, మే9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితా ల్లో అమ్మాయిల హవా కొనసాగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను వెల్లడించగా, జిల్లా మొదటి సంవత్సరం పరీక్షల్లో 55 శాతం, ద్వితీ య సంవత్సరంలో 63శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 19వ స్థానం రాగా, ద్వితీయ సంవత్సరంలో 22వ స్థానం దక్కింది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 6,207 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకాగా, 3,225 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 3001 మందికి 1,322 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు మొత్తం 3,206 మందికి 1,903 మంది ఉత్తీర్ణులయ్యా రు. బాలురు 44 శా తం, బాలికలు 59 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 6,440 మంది విద్యార్థులకు 4,031 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,023 మందికి 1659మంది, బాలికలు 3,417మందికి 2,372 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 55శాతం మంది, బాలికలు 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాలు జిల్లాలో గతం కంటే మెరుగుపడ్డాయని, ఈ సారి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి రమణి పేర్కొన్నారు.
రాష్ట్ర టాపర్‌గా అయేషా
470కి 468 మార్కులు సాధించిన అయేషా
భువనగిరి టౌన్: ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విఽభాగంలో భువనగిరిలోని శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలకు చెందిన అయేషా బేగం రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించింది. 470మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లీ్‌షలో 100కు 98, సంస్కృతంలో 99 మార్కులు సాధించగా గణితం ఏ, బీ పేపర్లలో 75కు 75, ఫిజిక్స్, కెమిస్ర్టీలో 60కి 60 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అయేషా 10వ తరగతిలోనూ 10 జీపీఏ సాధించింది. కలెక్టర్ కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం ఇప్పటి నుంచే కష్టపడుతున్నానని తెలిపింది. అయేషా తల్లిదండ్రులు ఎండీ హబీబ్, రిజియా స్వగ్రామంలోనే ఉంటూ పాల వ్యాపారం నిర్వహిస్తుంటారు. తమ కుమార్తె రాష్ట్రంలో ప్రథమ ర్యాంక్ సాధించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. అదే కళాశాలకు చెందిన శ్రీనిత్య ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000కి 986 మార్కులతో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించింది. భవిష్యత్‌లో ఉత్తమ ఇంజనీర్‌గా స్థిరపడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంటోంది. ఎంపీసీ విభాగంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని ఏనుగు అభినవి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి మొదటిర్యాంక్ సాధించారు.
Updated Date - 2023-05-10T00:41:59+05:30 IST