ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు

ABN, First Publish Date - 2023-07-21T02:56:18+05:30

గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య దంపతులు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు.

ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌ రెడ్డి కూడా..

న్యూఢిల్లీ/గద్వాల/నిజామాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య దంపతులు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. సరిత తిరుపతయ్య దంపతులు బీఆర్‌ఎస్‌ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ బండ్ల లక్ష్మీదేవమ్మ, చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు, బీఆర్‌ఎస్‌ గట్టు మం డల సర్పంచు ధనలక్ష్మి కృష్ణమూర్తి దంపతులు, మల్దకల్‌ మండలానికి పలువురు కూడా బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె స్‌లో చేరారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సునీల్‌ రెడ్డి ఇతర జిల్లాల నేతలతో కలిసి పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T02:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising