ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అదనంగా ఏడు మార్కులు

ABN, First Publish Date - 2023-01-30T02:54:31+05:30

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు అదనపు మార్కులు జోడించాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయం

కొత్తగా ఉత్తీర్ణులైన వారికి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు అదనపు మార్కులు జోడించాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించింది. ఆయా పరీక్షా ప్రశ్నపత్రాల్లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ రాత పరీక్ష రాసిన వారందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులందరికీ అదనంగా ఏడు మార్కులు కలపనుంది. ఈ పరిణామంతో కొత్తగా ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనుంది. 30 నుంచి సదరు అభ్యర్థులు ఆయా హాల్‌టికెట్‌ నంబర్లతో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పించేందుకు అవకాశం కల్పించింది ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Updated Date - 2023-01-30T02:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising