ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna Death: తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

ABN, First Publish Date - 2023-02-18T22:53:27+05:30

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు. తారకతర్న మృతి పట్ల హీరో రవితేజ, నాగశౌర్యతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన, అర్వింద్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు.

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌‌కు (PES) తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ట్రీట్మెంట్‌కు తారకరత్న శరీరం సహకరించలేదు. 23 రోజులుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Updated Date - 2023-02-18T23:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising