ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంప్లాయిమెంట్‌ కార్డ్‌ ఇక ఆటో రెన్యూవల్‌

ABN, First Publish Date - 2023-03-04T01:00:18+05:30

గతంలో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ చేసుకోవడం గగనంగా ఉండే ది. ప్రస్తుతం కాలానుగుణ మార్పులతో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ సులభతరమైంది. 2019 నుంచి ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ కూడా ఆన్‌లైన్‌లో చేసుకునే విధానం అమల్లోకి వచ్చింది. అందుకోసం ఠీఠీఠీ.్ఛఝఞజూౌడఝ్ఛుఽ్ట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రతీ మూడేళ్లకు ఒకసారి

54 ఏళ్ల వయసు వచ్చే వరకు చెల్లుబాటు

భువనగిరి టౌన్‌, మార్చి 3: గతంలో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ చేసుకోవడం గగనంగా ఉండే ది. ప్రస్తుతం కాలానుగుణ మార్పులతో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ సులభతరమైంది. 2019 నుంచి ఆన్‌లైన్‌లో ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవడం, రెన్యూవల్‌ కూడా ఆన్‌లైన్‌లో చేసుకునే విధానం అమల్లోకి వచ్చింది. అందుకోసం ఠీఠీఠీ.్ఛఝఞజూౌడఝ్ఛుఽ్ట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. తాజాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గత ఏడాది సెప్టెంబరు నుంచి ఒకసారి పేరు నమోదు చేసుకుంటే ఆ అభ్యర్థి వయస్సు 54 ఏళ్లు వచ్చే వరకు ఎంప్లాయిమెంట్‌ కార్డు చెల్లుబాటు అవుతుంది. అలాగే ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఆన్‌లైన్‌లోనే ఆటో రెన్యూవల్‌ అవుతుంది. అయితే కార్డు తీసుకున్న తరువాత అదనపు విద్యార్హతలు సాధిస్తే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. 54ఏళ్ల వరకు కార్డు చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాలను ఠీఠీఠీ.ుఽఛిట.జౌఠి.జీుఽ జాతీయ స్థాయి వెబ్‌సైట్‌కు బదిలీ చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో 21వేల మంది

ఉమ్మడి జిల్లాలో సుమారు 21వేల మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పేర్ల నమోదు ఆన్‌లైన్‌లో నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే ఉద్యోగాల భర్తీకి కొన్నేళ్లుగా ప్రభుత్వమే నేరుగా నోటిఫికేషన్‌ జారీ చేస్తుండడం, మరికొన్ని ప్రభుత్వ శాఖలు ఉపాధి కల్పనాధికారి కార్యాలయంతో నిమిత్తం లేకుండా విడిగానే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. దీంతో ఉపాధి కల్పనాధికారి కార్యాలయాల ప్రాము ఖ్యం తగ్గింది. అయితే అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతీ నెల జిల్లాల వారీగా జాబ్‌ మేళాలను ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరంలో జాబ్‌ మేళాల ద్వారా సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఈ శాఖల్లో తప్పనిసరి

మెజార్టీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్‌ కార్డు తప్పనిసరి కానప్పటి కీ, కొన్ని శాఖలలో నియామకాలకు మాత్రం ఎంప్లాయిమెంట్‌ కార్డును ఇప్పటికీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కారుణ్య నియామకాలు, వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ, తదితరశాఖల నియామకాల్లో ఎంప్లాయిమెంట్‌ కార్డు ఆప్షన్‌ ఉంది. అలాగే నిరుద్యోగ భృతికి నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నట్టు ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేరితే మాత్రం ఎంప్లాయిమెంట్‌ కార్డు తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు.

చదువు పూర్తి కాగానే ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవాలి : సాహితి, జిల్లా ఉపాధి కల్పన అధికారి

చదువు పూర్తయిన వారంతా ఎంప్లాయిమెంట్‌ కార్డు తీసుకోవాలి. ఈ కార్డుతో తక్షణ ప్రయోజనాలు ఉండనప్పటికీ ఉద్యోగ అవకాశాలకు మాత్రం దోహదపడుతుంది. ప్రైవేట్‌ రంగంలో అవకాశాలకు మార్గం కల్పిస్తుంది. స్వయం ఉపాధి కోసం రుణ సదుపాయాలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో ప్రభుత్వ విధానాలు మారితే ఎంప్లాయిమెంట్‌ కార్డు ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే నిరుద్యోగిగా నమోదయ్యే అవకాశం, ఆటో రెన్యూవల్‌, 54 ఏళ్ల వయసు వరకు చెల్లుబాటులో ఉండనున్నందున యువతరం ఎంప్లాయిమెంట్‌ కార్డును తీసుకోవాలి.

Updated Date - 2023-03-04T01:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!