ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరకట్న వేధింపులు ‘ముంచాయి’!

ABN, First Publish Date - 2023-06-24T00:51:16+05:30

ఇద్దరు అక్కాచెల్లెళ్ల క్షణికావేశం ఓ బాలుడి నిండు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది! కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులను భరించలేక ఆ అక్కాచెల్లెళ్లు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలుడి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన కుటుంబ కలహాలు

ముగ్గురు పిల్లలతో చెరువులో దూకిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు

నలుగురు క్షేమం.. ఐదేళ్ల చిన్నారి గల్లంతు

మరో ఘటనలో కుటుంబ కలహాలతో తల్లి, కుమార్తె ఆత్మహత్య

ఎడపల్లి, రాయదుర్గం, జూన్‌ 23: ఇద్దరు అక్కాచెల్లెళ్ల క్షణికావేశం ఓ బాలుడి నిండు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది! కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులను భరించలేక ఆ అక్కాచెల్లెళ్లు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. వారూ దూకారు. అప్రమత్తమైన స్థానికులు నీళ్లలోకి దూకి ఆ అక్కాచెల్లెళ్లను, ఇద్దరు పిల్లలను సురక్షితంగా బయటకు తెచ్చారు. ఐదేళ్ల బాలుడు మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్‌ నగరం దుబ్బ ప్రాంతానికి చెందిన అక్షయ, నిఖిత అక్కాచెల్లెళ్లు. వీరికి పెళ్లిళ్లయ్యాయి. ఒకరి భర్త మెదక్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తుండగా, మరొకరి భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు బిడ్డలకు వరకట్నం కింద నిజామాబాద్‌ నూతన కలెక్టరేట్‌ సమీపంలో తనకు ఉన్న 400 గజాల స్థలాన్ని తండ్రి సమానంగా పంచి రాసిచ్చాడు. కొత్త కలెక్టర్‌ పూర్తయ్యాక అక్కడ భూములకు రేట్లు పెరిగి చుట్టుపక్కల భూములన్నీ అమ్ముడుపోయాయి. అక్షయ, నిఖితకు వరకట్నంగా వచ్చిన భూమి చుట్టూ వెంచర్లు వేయడంతో వారి ప్లాట్లకు వెళ్లేందుకు దారే లేకుండాపోయింది. దీంతో ఆ రెండు ఫ్లాట్లూ అమ్ముడుపోవడం లేదు. ఆ స్థలాలు అమ్మేసిన తర్వాతే ఇంటికి రావాలంటూ ఇద్దరినీ భర్తలు ఇంట్లో నుంచి పంపించి వేశారు.

అయితే ఎంత ప్రయత్నించినా తమ ఫ్లాట్లను ఎవరూ కొనకపోవడంతో తమను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వరేమోనని అక్షయ, నిఖిత ఆందోళన చెందారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. చిన్నారులతో కలిసి జానకంపేట శివారులోని అశోక్‌ సాగర్‌ చెరువులోకి దూకారు. గమనించిన నెహ్రూనగర్‌ గ్రామానికి చెందిన షేక్‌ హైదర్‌, ఫారూఖ్‌ ఖాన్‌, జానకంపేటకు చెందిన గౌస్‌ వెంటనే చెరువులోకి దూకి.. అక్షయ, ఆమె కుమారుడు నమో (3), నిఖత, ఆమె కూతురు క్షేమ (1)ను బయటకు తెచ్చారు. అయితే నిఖిత కుమారుడు భవేశ్‌ (5) మాత్రం గల్లంతయ్యాడు. బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ రాయదుర్గంలో కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మణికొండకు చెందిన సదానందం-అలివేలు (40) దంపతులకు కుమార్తె లాస్య (14)తో పాటు కుమారుడు ఉన్నాడు. వీరికి స్థానికంగా నెలకు రూ.లక్ష దాకా ఇంటి అద్దెల రూపంలో వచ్చేది. దాయాదుల కలహాలతో అద్దెలు నిలిచిపోవడం, సదానందం ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తేనన్నా కష్టాలు తీరతాయేమోనని అనుకొని కుమార్తెతో తిరుపతి వెళ్లొచ్చింది. శుక్రవారం భర్తకు రూ.5వేలు ఇచ్చి యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకొని రావాలని చెప్పి పంపింది. అనంతరం వంటగదిలో ఆమె, పడకగదిలో కూతురు ఉరేసుకున్నారు.

Updated Date - 2023-06-24T00:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising