ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పనికిమాలినదాన... నన్ను ప్రశ్నించేదానివా..?

ABN, First Publish Date - 2023-10-04T03:43:01+05:30

‘పనికిమాలినదాన.. నువ్వు నన్ను ప్రశ్నించేదానివా.. నీకు ఇల్లు పెట్టను పో... ఏం చేసుకుంటావో చేసుకో..’

నీకు ఇల్లు పెట్టను పో..! దాన్ని బయటకు నెట్టేయండి

ఓ మహిళపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆగ్రహం

వేములపల్లి, అక్టోబరు 3: ‘పనికిమాలినదాన.. నువ్వు నన్ను ప్రశ్నించేదానివా.. నీకు ఇల్లు పెట్టను పో... ఏం చేసుకుంటావో చేసుకో..’ అంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాన్ని బయటకు నెట్టేయండ’ని ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా వనం విజయ అనే మహిళ అన్ని అర్హతలు ఉన్నా గృహలక్ష్మి జాబితాలో తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించింది. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే... ‘హౌలా ముం.. దాన, పనికిమాలినదాన...’ అంటూ దురుసుగా వ్యవహరించారు. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి ద్వారా ఇల్లు అందుతుందన్నారు. విజయలక్ష్మికి సైతం అర్హత ఉంటే తానే స్వయంగా అందేలా చూస్తానన్నారు. కాగా బీజేపీకి చెందినవారిగా చెబుతూ తన పేరు పక్కనపెట్టారని తెలియటంతో ఎమ్మెల్యేను ప్రశ్నించానని ఆమె తెలిపారు. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి అమానించిన ఎమ్మెల్యేపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత రెండు గంటలు పోలీస్‌ స్టేషన్‌లో వేచి ఉన్నా ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీంతో బీజేపీ నాయకులతో కలిసి నిరసనకు దిగానని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే సల్కునూరు గ్రామానికి వెళ్లగా యాదవులు నిరసన తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ జాబితాలో అర్హుల పేర్లు కాకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పేర్లు ఉన్నాయని తెలిపారు. అందరికీ వచ్చేలా చూస్తానంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

Updated Date - 2023-10-04T03:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising