పురావస్తు సంపద విభజన పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2023-03-05T03:03:29+05:30
ఉమ్మడి రాష్ట్రంలో ఆయా సందర్భాల్లో లభ్యమైన పురాతన వారసత్వ వస్తు సంపద, చారిత్రాత్మక అపురూప పురాతన శిల్పాల విభజన పనులు వేగంగా పూర్తి చేసి అప్పగించాలని రాష్ట్ర పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శితో శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, మార్చి4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో ఆయా సందర్భాల్లో లభ్యమైన పురాతన వారసత్వ వస్తు సంపద, చారిత్రాత్మక అపురూప పురాతన శిల్పాల విభజన పనులు వేగంగా పూర్తి చేసి అప్పగించాలని రాష్ట్ర పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ మ్యూజియంలు, కేంద్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురావస్తు సంపదను గుర్తించి ఆ రాష్ట్రానికి అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్ ఏపీ ఆర్కియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ మధ్య పురావస్తుశాఖకు చెందిన పురావస్తు సంపద, చారిత్రక, వారసత్వ, కళా ఖండాల విభజనపై వారు చర్చించారు.
Updated Date - 2023-03-05T03:03:29+05:30 IST