ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ వచ్చాక ధరణి రద్దు

ABN, First Publish Date - 2023-06-26T02:22:20+05:30

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌ అధికార బీఆర్‌ఎస్‌ నేతల జేబులు నింపుతోందని ఆరోపించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పోర్టల్‌ కూడా బంద్‌ కావడం ఖాయం..

బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాక్షస సమితి

కుటుంబ ఆర్థిక ప్రయోజనాలే కేసీఆర్‌ లక్ష్యం

కేంద్ర సాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు

మోదీ ఘనతను తనదిగా చెప్పుకొంటున్నారు

కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి

నాగర్‌కర్నూల్‌ బీజేపీ సభలో నడ్డా పిలుపు

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌ అధికార బీఆర్‌ఎస్‌ నేతల జేబులు నింపుతోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన నవ సంకల్ప సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎ్‌సగా మారిందే తప్ప.. కేసీఆర్‌ సర్కారు అవినీతి మాత్రం అలాగే కొనసాగుతోందన్నారు. పేదల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటేనే భ్రష్టాచార్‌ రాక్షస్‌ సమితి (అవినీతి రాక్షసుల సమితి) అని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం తప్ప.. తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే.. కేసీఆర్‌ అంతా తానే సాధించినట్లు చెప్పుకొంటూ అమరుల ఆత్మలకు అశాంతి కలిగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వైద్యం, ఆరోగ్యంతోపాటు ఆర్థిక రంగాలు, ప్రాజెక్టుల కోసం కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయాన్ని కేసీఆర్‌ తప్పుదోవ పట్టించారని నడ్డా ఆరోపించారు. 80 కోట్ల మంది ప్రజలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ ఇస్తుండగా, దానిని కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు చరమగీతం పాడకుంటే తెలంగాణకు అధోగతి తప్పదన్నారు. దళితులు, వంచితులు, వెనకబడిన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడుతోందని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చేపట్టనున్న సోమశిల- సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం బీజేపీతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచపటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కేవలం నరేంద్రమోదీకి, బీజేపీ ప్రభుత్వానికే సాధ్యమైందని ఆయన చెప్పారు.

దొరల పాలనలో దుర్భరం..

దొరల పాలనలో రాష్ట్రం దుర్భరంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పేదలను మభ్యపెట్టడం తప్ప తెలంగాణ సమాజానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్‌ అనుకుంటే కాదని, ప్రజలు అనుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎ్‌సతో కలిసి పోటీ చేస్తుందని, ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రె్‌సలోని 30 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ పోషిస్తున్నారని, వారికి పాకెట్‌ మనీ కూడా ఇస్తున్నారని అన్నారు. వారు ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి బీఆర్‌ఎ్‌సలోకి రావాలన్నది ఆయన పన్నాగమని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతి పాలనను కేంద్రం డేగ కళ్లతో చూస్తోందని, తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మహేంద్రనాథ్‌ పాండే, జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising