ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొన్న డీసీఎం

ABN, First Publish Date - 2023-07-21T00:40:02+05:30

రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని డీసీఎం ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి.

జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

డీసీఎం డ్రైవర్‌కు గాయాలు

చిట్యాలరూరల్‌, జూలై 20: రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని డీసీఎం ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంటెయినర్‌ లారీ హైదరాబాద్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి శివారులో బతుకమ్మ చెరువు సమీపంలో మరమ్మత్తుల కోసం రోడ్డు పక్కన నిలిపాడు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న డీసీఎం రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌ ముజఫర్‌ఖాన్‌కు రెండు కాళ్లు విరిగాయి. దీంతో ఆయన క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. గమనించిన వాహనదారులు, స్థానికులు, పోలీసులు ఆయనను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం జీఎంఆర్‌కు చెందిన 1033 ఆంబులెన్స్‌లో చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిట్యాల ఎస్‌ఐ ఇ. రవి తెలిపారు.

జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌జాం

డీసీఎం, కంటెయినర్‌ లారీని ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాద స్థలి నుంచి గుండ్రాంపల్లి శివారు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సమీపం వరకు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే ఉన్న యూటర్న్‌ నుంచి వాహనాలు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో వన్‌వేలో హైదరాబాద్‌ వైపునకు వాహనాలు మళ్లడంతో హైదారాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌జాం అయిం ది. డీసీఎంను రోడ్డుపై నుం చి పక్కకు తొలగించేందుకు సమయం పట్టడంతో జాతీ య రహదారిపై ఇరువైపులా సుమా రు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. నార్కట్‌పల్లి సీఐ మహేష్‌, చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరు కొని డీసీఎంను పక్కకు జరిపి రహదారిపై ట్రాఫి క్‌ను క్రమబద్ధీకరించారు.

Updated Date - 2023-07-21T00:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising