మొసలికన్నీరు మాయం
ABN, First Publish Date - 2023-09-22T02:31:39+05:30
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘
మహిళా బిల్లుపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్య
ఎవరిని ఉద్దేశించి చేశారన్నదానిపై చర్చ
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. రాజకీయవారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు దార్శనిక నాయకుల చొరవ ముందు మాయమయ్యాయి. ప్రధాన మంత్రికి దేశం మొత్తం ధన్యవాదాలు తెలుపుతోంది’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. కాగా గవర్నర్ చేసిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అన్న దానిపై చర్చ జరుగుతోంది. మహిళా బిల్లు ఆమోదం తమ వల్లే సాధ్యమైందని ఎవరికి వారు చెప్పుకుంటున్న నేపథ్యంలో గవర్నర్ ట్వీట్ చర్చకు దారితీసింది.
Updated Date - 2023-09-22T02:31:39+05:30 IST