నీటి వాటా తేల్చేవరకు సీపీఐ పోరాటం : సత్యం
ABN, First Publish Date - 2023-05-02T00:22:31+05:30
కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చేవరకు సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జి ల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.
నీటి వాటా తేల్చేవరకు సీపీఐ పోరాటం : సత్యం
మునుగోడు రూరల్, మునుగోడు, మే 1: కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చేవరకు సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జి ల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని ప్రారంభించిన పాదయాత్ర సోమవారం మునుగోడు మండలంలోని చొల్లేడు, చీకటిమామిడి, కొంపె ల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రా విభజన చట్టం హామీలను అమలుచేయకుండా, కష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుండా కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తుందని అన్నారు. బీజేపీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతుందన్నారు. దేశ సంపదను ప్రధాని న రేంద్రమోదీ అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. పాదయాత్రకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, బీఎస్పీ నాయకులు పందుల సురేష్ సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. అంజయ్య, కె. శ్రీనివాస్, బచ్చనగోని గాలయ్య, బొల్గూరి నరసింహ, జి.రామచంద్రన, వెంకటేశ్వర్లు, చాపల శ్రీను, ఈదులకంటి కూలాస్, గోస్కోండ లింగయ్య, యాదయ్య, పాండు, లింగస్వామి, వెంకన్న, సత్తమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-02T00:22:31+05:30 IST