ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భైంసాలో ‘ది కేరళ స్టోరీ’పై వివాదం

ABN, First Publish Date - 2023-05-15T03:03:33+05:30

నిర్మల్‌ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనపై మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది. స్థానిక కమల థియేటర్‌లో శుక్రవారం సినిమా ప్రదర్శన ప్రారంభం కావాల్సి ఉండగా పోలీసులు అడ్డుకొని నిలిపేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో థియేటర్‌ మేనేజర్‌, డిస్ట్రిబ్యూటర్‌

కాంట్రాక్టర్‌ ఇంట్లో లభించిన నగదు

భైంసా, మే 14: నిర్మల్‌ జిల్లా భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనపై మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది. స్థానిక కమల థియేటర్‌లో శుక్రవారం సినిమా ప్రదర్శన ప్రారంభం కావాల్సి ఉండగా పోలీసులు అడ్డుకొని నిలిపేశారు. శుక్ర, శనివారాలు థియేటర్‌ను మూయించారు. ఆదివారం థియేటర్‌ నిర్వాహకులు సినిమా ప్రదర్శన ప్రారంభించారు. మార్నింగ్‌ షో, మ్యాట్నీ సాఫీగా సాగగా.. ఫస్ట్‌ షో ఆరంభించే సమయంలో భైంసా టౌన్‌ ఇన్‌ఛార్జి సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై తిరుపతి వచ్చి నిలిపివేయించారు. థియేటర్‌లోని ప్రేక్షకులను బయటకు పంపించేశారు. అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారని థియేటర్‌ మేనేజర్‌, డిస్ట్ట్రిబ్యూటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. థియేటర్‌కు తాళం వేయించారు. ఈ సమాచారం అందుకున్న భైంసా పట్టణ హిందూవాహిని ప్రతినిధులు థియేటర్‌కు వచ్చి సినిమా ప్రదర్శనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగి, ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండడంతో పోలీసులు హిందూవాహిని నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-05-15T03:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising