చిట్యాల ఐలమ్మ.. తెలంగాణ ఆస్తి: గంగుల
ABN, First Publish Date - 2023-09-27T04:03:00+05:30
చిట్యాల ఐలమ్మను ఏ ఒక్క కులానికి పరిమితం చేయొద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఐలమ్మ 128వ జయంతి వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడారు.
హైదరాబాద్/రవీంద్రభారతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): చిట్యాల ఐలమ్మను ఏ ఒక్క కులానికి పరిమితం చేయొద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఐలమ్మ 128వ జయంతి వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడారు. ఐలమ్మ ఆత్మగౌరవం కోసం భూస్వాములకు ఎదురొడ్డి గొప్ప పోరాటం చేశారని కొనియాడారు. అంతటి వీరవనిత చరిత్రను ప్రజలకు తెలియకుండా సమైక్య పాలకులు కుట్రలు చేశారని ఆరోపించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
Updated Date - 2023-09-27T04:03:00+05:30 IST