ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోపణలను నిరూపించగలరా?

ABN, First Publish Date - 2023-03-02T02:56:09+05:30

తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే ఆధారాలు తీసుకొని రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దమ్ముంటే ఆధారాలు తీసుకొని రండి

కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెల్యే గండ్ర సవాల్‌

తాను సిద్ధమన్న గండ్ర సత్యనారాయణ

భూపాలపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే ఆధారాలు తీసుకొని రావాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం, బీఆర్‌ఎస్‌ నేతలు రాళ్ల దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర విలేకరులతో మాట్లాడారు. తాను కబ్జా చేసినట్టు నిరూపిస్తే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. 2004, 2005లోనే చిట్యాల మండలం గిద్దెముత్తారం వద్ద 400 ఎకరాలు కొనుగోలు చేశానని, అప్పటికి తాను ప్రజాప్రతినిధిని కూడా కాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ భూములను కొనుగోలు చేశామని తెలిపారు. వీటిపైనా కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు. కాగా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు ప్రకటించారు. నిరూపించలేకుంటే ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిసవాల్‌ చేశారు. భూపాలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే పోలీసుల ప్రమేయం లేకుండా.. మీడియా ప్రతినిధుల సమక్షంలో చర్చకు రావాలని సూచించారు. ఇదిలా ఉండగా, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే గండ్రపై రేవంత్‌ అసత్య ఆరోపణలు చేశారంటూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే గండ్ర దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బండపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టేకుమట్ల మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వాహనాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను పక్కకు తప్పించి, ఎమ్మెల్యే వాహనాన్ని పంపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం నేపథ్యంలో భూపాలపల్లిలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

Updated Date - 2023-03-02T02:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!